Balli Sastram in Telugu

బల్లి మీద పడితే.. బల్లి శాస్త్రం ఏమి చెబుతుంది…?

Balli Sastram in Telugu: బల్లి మీద పడితే భయపడని వారు ఉండరు. కొన్ని దేశాల్లో బల్లులని వండుకొని తింటారు, భారత దేశంలో బల్లికి ప్రత్యేకత ఉంది. బల్లి అంటే భయం మాత్రమే కాదు గౌరవం కూడా చాలా మందికి ఉంది. బల్లి శాస్త్రం ఎప్పటి నుంచో ఉందనేదానిని కొట్టివేయలేము, కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో బంగారు బల్లి దర్శనం కూడా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. బల్లి శాస్త్రమంటే ఏమిటి, శరీరంలో ఎక్కడెక్కడ బల్లి పడితే అరిష్టం, ఎక్కడ బల్లి పడితే మంచిది అనే విషయాలు తెలుసుకుందాం. 

Balli Sastram in Telugu

బల్లి శాస్త్రం పురుషులకు స్త్రీలకూ రెండు రకాలుగా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇరువురికి ఒకే విధంగా ఉన్నా.. స్త్రీలకూ, పురుషులకు వేరు చేసి శాస్త్రం కొన్ని ముఖ్య అంశాలను వెల్లడిస్తుంది. 

You may also like:

స్త్రీలపై బల్లి పడితే…?

స్త్రీలకు సంబంధించినంత వరకు.. స్త్రీల తలపై బల్లి పడితే మరణ భయం, కొప్పు పై పడితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పిక్కలపై పడితే బంధువులు వస్తారు. కుడి కన్ను మీద పడితే మానిసిక సమస్య, ఎడమ కన్ను మీద బల్లి పడితే భర్త లేదా దగ్గరి వారి నుంచి ప్రేమను పొందుతారు. రెండు పెదవుల మధ్యలో పడితే సమస్యలు ఎదురవుతాయి, కింద పెదవి పై పడితే కొత్త వస్తువులు కొనుగోలు చేయబోతున్నారని సంకేతం. 

పురుషులపై బల్లి పడితే….?

పురుషుల విషయానికి వస్తే.. వీపు పై కుడి ప్రదేశంలో పడితే రాజభయం సంకేతంగా చెబుతుంది బల్లి శాస్త్రం. రాజ భయం అంటే పోలీస్ కేసులు, పెనాల్టీలకు సంబంధించినదనే అర్ధం వస్తుంది. మనికట్టు పై పడితే బంగారం, లేదా ఇతర ఆభరణాలు కొనే అవకాశం ఉంది. మోచేయి పై పడితే ఆర్ధికంగా నష్టపోతారు, వేళ్ళపై పడితే బంధువులు స్నేహితులు వస్తారు. కుడి భుజం, లేదా ఎడమ భుజం పై పడితే కష్టాలు, సమస్యలు, అవమానాలు ఎదురవుతాయి. తొడలపై పడితే బట్టలు నాశనమవుతాయి. మీసాలపై పడితే కష్టాలు, కాలి వేళ్ళపై పడితే సమస్యలు, అదే పాదాల పై పడితే ప్రయాణానైకి సిద్దమైతున్నట్లు సంకేతం. పురుషుల్లో తలపై బల్లి పడితే మరణం వెంటాడుతున్నట్టు, మొఖం పై పడితే భిన్నంగా లాభాల బాట పెట్టె అవకాశం ఉన్నట్టు చెబుతుంది బల్లి శాస్త్రం. ఎడమ కన్ను పై పడితే విజయం, కుడి కన్ను పై పడితే అపజయం ఎదురవుతుంది. నుదిటి పై బల్లి పడితే సమస్యలతో పాటు విడిపోయే అవకాశం ఉంది. పై పెదవి పై పడితే కష్టాలు, కింది పెదవి పై పడితే లాభం కలుగుతుంది. పురుషులకి రెండు పెదవుల మధ్యలో పడితే మృత్యువు సంభవిస్తుందని బల్లి శాస్త్రం చెబుతుంది.

మనుషులపై బల్లి పడితే..?

బల్లి శాస్త్రం ప్రత్యేకంగా కాకుండా మనుషులందరికీ కలిపి కూడా కొన్ని ముఖ్యాంశాలను, హెచ్చరికలనిస్తుంది. మనిషి మూడు భాగాల్లో అంటే శిరస్సు, మొండెం, నడుము కింది భాగంలో ఎక్కడ ఏ ప్రదేశంలో బల్లి పడితే, ఎటువంటి ఫలితాలు ఉంటాయో వివరించడం జరిగింది. 

శిరస్సు పై బల్లి పడితే…?

శిరస్సు = గొడవలు

ముఖము నందు = బంధువుల రాక

కనుబొమ్మల నడుమ = రాజానుగ్రహం

పై పెదవి = ఖర్చులు పెరుగుతాయి

క్రింది పెదవి = లాభాలు వస్తాయి

ముక్కు చివర = అనారోగ్యం

కుడి చెవు = దేర్ఘాయువు

ఎడమ చెవి = వ్యాపార లాభం

నేత్రాల యందు = శుభం

గడ్డం నందు = రాజ దండనము

నోటి మీద = ఇస్టాన్న భోజనం

జుట్టు  = మృత్యువు

కన్నుల మీద = శుభం

దవడల మీద =వస్త్ర లాభం

మొండెం భాగంలో బల్లి పడితే…..?

మెడ యందు = పుత్ర జననం

కంఠము నందు = శత్రువు

కుడి భుజం = ఆరోగ్యం

ఎడమ  = స్త్రీ సంభోగం, ఆరోగ్యం

కుడి ముంజేయి = కీర్తి

ఎడమ ముంజేయి = రోగం

హస్తం = ధన లాభం

చేతి గొళ్ళ యందు = ధన నాశనం

స్తన భాగం = దోషం

ఉదరం = దాన్య లాభం

రొమ్ము, నాభి = ధన లాభం

నడుము కింది భాగంలో బల్లి పడితే….?

మోకాళ్ళు = స్త్రీ, ధన లాభము

పిక్కల యందు = శుభము

మడములు = శుభము

పాదం = ప్రయాణం

కాలి గోళ్ళు= నిర్లజ్జ

లింగం = దారిద్యం

మీద పడి, వెను వెంటనే దానంతట అది వెళిపోతే = మంచిది

దేహము పై పరిగెడితే = దీర్ఘాయువు

బల్లి శాస్త్రం అనేక ఏళ్ల  నుంచి ఉంది.. ఎందరో మేధావులు దీనిని కొట్టి పారేసినా, అనేక మంది ఈ బల్లి శాస్త్రాన్ని నమ్ముతున్నారు. బల్లి అరిష్టం పోవాలంటే, కంచి కామేష్టి అమ్మవారి ఆలయంలోని బంగారు బల్లి దర్శనం చేసుకోవాలని చెబుతున్నారు. ఒక వేళ దర్శనం చేయలేకున్నా, బంగారు బల్లి దర్శనం చేసుకున్న వారి కాళ్లకు నమస్కారం చేసినా కూడా ఆ అరిష్టం తొలగి పోతుందనే నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read